Balakrishna warning: ఆ హీరోను కలవద్దంటూ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ..!

Balakrishna warning: తాజాగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన , బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆహా , ఓటి ప్లాట్ ఫాం ద్వారా ‘ అన్‌స్టాపబుల్ ‘షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ.. తన టైమింగ్ తో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షో ద్వారా బాలకృష్ణ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి నుండి ఆసక్తికర సమాధానాలను పొందుతున్నారు.

తాజాగా ఆయన హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కి మాస్ మహారాజ రవితేజ , డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యారు . నందమూరి బాలకృష్ణ , గోపిచంద్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ షో లో గోపీచంద్ మాట్లాడుతూ తాను , రవితేజ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటామని , ఈ షోకి రెండు రోజుల ముందు కూడా తాము కలిశామని చెప్పుకొచ్చారు. దీనికి బాలకృష్ణ స్పందిస్తూ ” మీ మునుపటి హీరోని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? మీకు కాబోయే హీరోని కలవండి ఇంకొక బ్లాక్ బాస్టర్ అందించవచ్చు” అని అన్నారు. ఇలా ఈ షో వారి ముగ్గురి మాటల వల్ల ఎంతో సరదాగా సాగిపోయింది.

అన్‌స్టాపబుల్ షో ముగించే సమయంలో కూడా బాలకృష్ణ మళ్లీ అదే టాపిక్ మాట్లాడుతూ వచ్చే ఆరు నెలలు రవితేజని కలవకుండా నన్ను కలవండి . మనం ఇద్దరం కలిసి బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత తనని కలవండి అంటూ గోపీచంద్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు రవితేజ కూడా సరదాగా స్పందిస్తూ ‘ సార్ మీరు గోపీని నా దగ్గరికి పంపకండి తనని కలవటానికి నేనే మీ సెట్ కి వస్తాను ‘ అని అన్నాడు. దీనికి బాలకృష్ణ రవితేజ గోపినీ ఎక్కడైనా కలవచ్చని చెప్పారు .