Naga chaitanya: మరోసారి బుట్టబొమ్మతో జతకట్టనున్న నాగచైతన్య..!

Naga chaitanya: నాగచైతన్య అక్కినేని వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా స్టాండ్ అయ్యాడు. ఏ మాయ చేసావే సినిమాతో గుర్తింపు తెచ్చుకుని మంచి సక్సెస్ ను అందుకున్నాడు. సమంతను పెళ్లి చేసుకుని హాట్ టాపిక్ గా మారి విడాకులతోను అంతే పాపులర్ అయ్యారు చై, సామ్. విడాకుల తర్వాత డీలా పడిపోకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు నాగ చైతన్య. ఇటీవల తన తండ్రి తో కలిసి నటించిన బంగార్రాజు సంక్రాంతి రిలీజ్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వసూలు బాగానే చేసింది.

ఇక ఇపుడు నాగచైతన్య ద్విభాష చిత్రంలో నటించనున్నారని తెలుస్తోంది. వెంకట్ ప్రభు డైరెక్టర్ గా ఈ సినిమా రానుంది తెలుగు తమిళ్ లో తీయబోతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోబోతునట్టు సమాచారం. నాగచైతన్య, పూజ హెగ్డే ఇంతకు ముందు ఒక లైలా కోసం మూవీలో హీరో, హీరోయిన్ లు గా నటించారు.ఈ క్రమంలోనే మరో సారి వీరిద్దరూ కలిసి ద్విభాషా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక నాగచైతన్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ అనే సినిమా చేస్తున్నారు. అలాగే చై ఖాతాలో ఒక వెబ్ సిరీస్ కూడా ఉందని సమాచారం.
ఇక పూజ హెగ్డే టాప్ హీరోయిన్ మారిపోయింది. తమిళ్ లో విజయ్ సరసన నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఇప్పటికే రిలీజ్ ఐన అరబిక్ కాతూ సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది .ఇక ఈ ముద్దుగుమ్మా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కన్పించనుంది.