పెద్ద హీరోల ముందు డబ్బులు కుమ్మరిస్తున్న నిర్మాత

Mythri Movie Makers

Mythri Movie Makers

పెద్ద హీరోలతో సినిమాలు చేయాలంటే నెలలు లేదా ఏడాది ముందుగానే వారి డేట్స్ పట్టుకోవాలి. కొంచెం పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సినిమా చేయడానికి మాట తీసుకోవాలి. అప్పుడే పెద్ద సినిమాలు తీయగలరు. ప్రజెంట్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ ఫార్ములానే పాటిస్తోంది. వరుసగా పెద్ద సినిమాలను నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మైత్రి సంస్థ ఫ్యూచర్లో ఇంకా పెద్ద సినిమాలు చేసేలా ప్రణాళిక వేసుకుంటోంది. వీరి జాబితాలో అగ్ర హీరోలందరూ ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటోంది ఈ సంస్థ. అంత పెద్ద హీరోలు మామూలుగా డేట్స్ ఇవ్వమంటే కుదరదు కదా.. అందుకే పెద్ద మొత్తంలో అడ్వాన్సులు చెల్లిస్తున్నారట. ఇప్పటికే చిరు, పవన్, మహేష్ బాబులకు టోకెన్ అమౌంట్ ఇచ్చేసిన మైత్రి నిర్మాతలు తాజాగా ప్రభాస్ కు కూడ భారీగా ముట్టజెప్పారట. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటివరకు మైత్రి మూవీస్ ఇచ్చిన అడ్వాన్సులే 100 కోట్ల నుండి 125 కోట్ల వరకు ఉంటాయట. దీన్నిబట్టి సినిమాలు ఏ లెవల్లో ఉండబోతున్నాయో అర్థం ఊహించుకోండి.