ప్రశాంత్ నీల్ ప్రజెంట్స్- మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో కొత్త చిత్రం గ్రాండ్ గా లాంచ్

Keerthan Nadagowda: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొలాబరేషన్ లో యంగ్ స్టర్స్ తో కలసి సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్నారు.

సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిత్ర యూనిట్ సభ్యులు పూజకార్యక్రమంలో పాల్గొన్నారు.

భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌లో నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. సైన్స్– మిస్టరీ, సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్ తో ఇప్పటివరకూ చూడని సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

ఈ చిత్రంలో శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ దివాకరన్ డీవోపీ, వెంకీ జి.జి మ్యూజిక్ అందిస్తున్నారు. మోహన్ బి.ఎస్ డైలాగ్స్ రాస్తున్నారు. అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

తారాగణం: సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల, శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్

సమర్పణ: ప్రశాంత్ నీల్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
DOP: దినేష్ దివాకరన్
సంగీతం: వెంకీ జి.జి
డైలాగ్స్: మోహన్ బి.ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్
కాస్ట్యూమ్ డిజైన్: సమృద్ధి పటేల్, షర్నితా వల్లూరు
పీఆర్వో: వంశీ శేఖర్

Cine Critic Dasari Vignan Review On Varanasi || Mahesh babu || Priyanaka Chopra || Raja Mouli || TR