Nidhi Agarwal: ‘నాకు కాబోయే భర్త అలా ఉండాలి’ అంటూ.. సీక్రెట్ బయటపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ..!

Nidhi Agarwal: నిధి అగర్వాల్ తెలుగులో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి ఫామ్ లోకి వచ్చింది . అంతకుముందు చేసిన సవ్యసాచి , మిస్టర్ మజ్ను సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టలేకపోయాయి. కానీ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది.

తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ప్రస్తుతం నిధి అగర్వాల్ బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా నిధి అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది , ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ తన అందంతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది . ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ” హీరో ” చిత్రంలో అశోక్ గల్లా హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది . ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకు సిద్ధంగా ఉంది . తాజాగా ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ అబ్బాయిల గురించి తనకున్న ఒపీనియన్ బయట పెట్టింది. అలాగే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిధి రివీల్ చేసింది. తనకు కాబోయే భర్త తన నాన్నల అందరిని గౌరవించే వ్యక్తి అయ్యుండాలని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . ఈ బ్యూటీ నటించిన హరిహర వీరమల్లు , హీరో సినిమాల తర్వాత తెలుగులో వేరే సినిమాలు ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ భామ హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్నట్టు ఆ సినిమా ఏప్రిల్ నుంచి మొదలవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేసింది . అగ్రతారలతోనే నటించాలి అన్న నియమం లేకుండా తనకు కథ నచ్చితే సినిమా చేస్తానని ఆమె చెప్పారు. హీరో సినిమా కథ తనకు బాగా నచ్చింది. అందువల్ల తను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని తెలిపారు. ఈ సినిమాలో డార్క్ కామెడీ , వాణిజ్య సూత్రాలతో కూడుకొని ఉంటుందని నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.