Vaishnav Tej: మెగా మేనల్లుడి బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్న మూవీ మేకర్స్..!

Vaishnav Tej: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు.బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వైష్ణవ తేజ్ హీరోగా , కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. వీరిద్దరికీ ఇది ఇది మొదటి సినిమా అయినప్పటికీ వారి నటనతో అందరిని మెప్పించారు. ఈ ఒక్క సినిమా సాధించిన విజయం ద్వారా వైష్ణవ తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించిన తర్వాత వైష్ణవ్ తేజ్ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన కొండ పాలెం సినిమాలు నటించారు.
కొండ పాలెం సినిమా మొత్తం గొర్రెల కాపరుల కష్టాల గురించి తెలియజేస్తుంది. ఈ సినిమాలో గొర్రెల కాపరిగా వైష్ణవ తేజ్ తన నటనను నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, వైష్ణవ్ తేజ్ కి జోడిగా నటించింది. కరోనా కారణంగా ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మను ఎంపిక చేసుకున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ గురించి సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కాగా ఈ సినిమా కోసం సినీ నిర్మాతలు రంగ రంగ వైభవంగా, ఆబాల గోపాలం అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారని వినికిడి. ఈ సినిమా కోసం రంగ రంగ వైభవంగా టైటిల్ ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఈ సినిమా మేకర్స్ వైష్ణవ్ తేజ్ బర్త్ డే రోజున స్పెషల్ గిఫ్ట్ ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది .