మోహన్ బాబు ఆ పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన జగన్ కి పెద్దగా నష్టమేమీ లేదు: గీతాకృష్ణ

మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. విద్యావేత్తగా కూడా పలు విద్యాసంస్థలను స్థాపించి అంతే గుర్తింపు పొందారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు రాజకీయాలలో కూడా తన మార్క్ చూపించారు. అయితే ఈయన మొదటిసారిగా టిడిపి పార్టీలో చేరి ఎంపీగా కొనసాగారు. అయితే ఈయన కొన్ని రోజుల తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్మోహన్ రెడ్డి స్వయానా మంచు విష్ణుకు బావ కావడంతో ఈ పార్టీలోకి వెళ్తే వీరికి సరైన గుర్తింపు ఉంటుందని భావించి ఈ పార్టీలోకి వెళ్లారు. అయితే జగన్ మాత్రం ఎవరిని అందలం ఎక్కించి తిప్పరు. ఆయన ఒక వ్యూహకర్త. ఇలా వైసీపీ పార్టీలో మోహన్ బాబు కుటుంబానికి పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడంతో ఈయన బీజేపీ పార్టీలోకి చేరుతున్నారు అంటూ డైరెక్టర్ గీత కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్లినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం నష్టం లేదని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా వచ్చే ఎన్నికలలో ఆయనే మరోసారి ముఖ్యమంత్రిగా గెలుస్తారని గీత కృష్ణ వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ భజన చేసే వాళ్ళు పార్టీలో లేకపోయినా ఈ పార్టీ వల్ల బడుగు బలహీనవర్గాలు ద్వారా లబ్ధి పొందిన వారు తప్పకుండా ఆయనకు ఓట్లు వేసి తనను గెలిపిస్తారని ఈయన తెలిపారు.ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టపడుతున్నారని వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా గెలుస్తారని ఈ సందర్భంగా గీతాకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.