ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పాజిటివ్ వస్తే ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామన్నారు. మరి మీ మంత్రులెందుకు ప్రైవేటులో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణలో ఎంత మందికి కరోనా వచ్చినా గాంధీ ఆస్పత్రే దిక్కుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న హోం మంత్రి మహమూద్ అలీ కి , నేడు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కరోనా వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించమని చెప్పారు. మరి మీ హోం మంత్రి మహమూద్ అలీ కి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి ఎలా చికిత్స తీసుకుంటున్నారు? అంటే మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల మీద వాళ్ళకి నమ్మకం లేనట్లే కదా? అందుకే మీ హోమ్ మంత్రి, మీ ఎమ్మెల్యే లు, యశోద ఆసుపత్రి, లేకపోతే అపోలో ఆసుపత్రి లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. మీరు ఫాం హౌస్ నుండి లేదా మీ ఇంటి నుంచి ఒకసారి బయటికి రండి… బయటకు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించండి … అక్కడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి మీకు అర్థమవుతుంది… అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ బాగా చూస్తున్నారు.. వాళ్లు అన్ని వసతులు కల్పిస్తున్నారు…కానీ తెలంగాణ లో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటే ఓకే ఒక్క ఆసుపత్రి , గాంధీ మాత్రమే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి చూడండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలను చంపకండి.
పేదలు చనిపోతే కూడా బాడీ దొరకని పరిస్థితి రాష్ట్రం లో ఉందన్నారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. మీ హోం మంత్రి మహమూద్ అలీ ,మీ ఎమ్మెల్యేలు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడమే… తన ఆరోపణలకు తాజా నిదర్శనాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.