Minister Perni Nani Garu : ఫాఫం పేర్ని నాని.! సమాధానం చెప్పుకోలేని దుస్థితి.!

Minister Perni Nani Garu : ఎవర్ని దోచుకోవడానికి టిక్కెట్ రేట్లు పెంచాలి.? టిక్కెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా.?
– పేర్ని నాని.!

మొదటి పది రోజులు టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు టిక్కెట్ రేట్లు పెంచుకోవచ్చు.!
– పేర్ని నాని.!

ఇద్దరూ వేర్వేరు కాదు. ఇద్దరూ ఒకరే. ఏపీ మంత్రి పేర్ని నాని ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఒకలా, ఇంకో సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇంకోలా వున్నాయి. ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో పేర్ని నాని ఒకలా స్పందిస్తే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయానికొచ్చేసరికి ఇంకోలా మారాయ్.

చిత్రమేంటంటే రెండు సినిమాల్లోనూ నటించింది మెగా కాంపౌండ్‌కి చెందిన హీరోలు కావడం. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే, ఇంకొకరు రామ్ చరణ్.

ఎందుకీ తేడా.? ‘భీమ్లానాయక్’ సినిమాకి కల్పించిన ఆటంకాలు, ‘రాధేశ్యామ్’ సినిమాకి ఎందుకు కలగలేదు.? అన్నదే పెద్ద మిస్టరీ.
‘భీమ్లానాయక్’ సినిమా విడుదల సమయంలో ఏకంగా వీఆర్వోలు, పోలీసు అధికారులు థియేటర్ల వద్ద మోహరించేశారు. మంత్రులు మీడియా ముందుకొచ్చి నెగెటివ్ రివ్యూలు చెప్పారు. కానీ, ‘రాధేశ్యామ్’ సినిమా సమయంలో ఎవరూ అలా కనిపించలేదు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరింత వెసులుబాట్లు ఇచ్చేశారు. పైగా, టిక్కెట్ల రేట్లు పెంచుకోవచ్చన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధనవంతులైపోయారా.? సినిమా ప్రేక్షకులు పేద స్థాయి నుంచి ధనవంతుల స్థాయికి ఎలా ఎదిగిపోయారు.?

అప్పుడేమో రేట్లు పెంచడమంటే దోచుకోవడానికేనన్నారు. మరిప్పుడేమో రేట్లు పెంచేశారు. మరి ఎవరు దోచుకుంటున్నట్లు.? మంత్రి పేర్ని నాని.. రెండు సందర్భాలకీ కలిపి ఓ పొలిటికల్ రివ్యూ ఇస్తే బావుంటుందేమో.!