మెగాస్టార్ మ్యాజిక్: అంచనాలకు మించి

ఆ ఏజ్ ఏంటీ.? ఆ సినిమాలేంటీ.? ఆరు పదుల వయసులోనూ మాస్ ఊర మాస్ అంటూ చెలరేగిపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆఫ్ స్ర్కీన్ చిరంజీవికీ, ఆన్ స్ర్కీన్ చిరంజీవికీ చాలా చాలా డిఫరెన్స్.. ఒక్కసారి కెమెరా.. లైన్స్ ఆన్.. అనగానే ఇక అంతే చెలరేగిపోతాడు. అందుకే ఆయన మెగాస్టార్.

లేటెస్టుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ని ఉత్కంఠకు గురి చేస్తోంది. చిరంజీవి  ఏం చేయబోతున్నాడు.? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదే కాదు, చిరంజీవి నుండి వస్తున్న ప్రతి సినిమా కూడా ఇలాగే ఉండబోతోంది.

‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’.. ఇలా  ఏ సినిమా తీసుకున్నా, ఆయన ఏజ్‌తో సంబంధం లేకుండా మాంచి గేజున్న సినిమాలే అని తెలుస్తోంది. రాజకీయాల పుణ్యమా అని అనవసరంగా 8 ఏళ్లు సినిమా కెరీర్ వేస్ట్ అయిపోయింది కానీ, లేకుంటేనా.? ఈ పాటికే ఎన్ని సంచలనాలో.. ఎన్నెన్ని అద్భుతాలో మెగాస్టార్ నుండి పుట్టుకొచ్చేసేవి. ఎనీ వే ఇకపై మెగాస్టార్ మ్యాజిక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు.