‎KishkindPuri Event: బెల్లంకొండ శ్రీనివాస్ కోసం బరిలోకి ఆ ముగ్గురు దర్శకులు!

‎KishkindPuri Event: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మనందరికి తెలిసిందే. మొదట అల్లుడు శీను సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి. అయితే చెప్పుకోదగ్గ సినిమా ఒకటీ కూడా లేకపోయినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మాత్రం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

‎అయితే ఇందుకు గల కారణం తన వ్యక్తిత్వం అని చెప్పాలి. ఏ రోజు కూడా ఒక్క మాట ఎక్కువగా మాట్లాడలేదు. ప్రతిసారి తనను తాను తగ్గించుకుంటూ జనాల దృష్టిలో మాత్రం ఎక్కువైపోయాడు. అందుకే తన సినిమా ఎలా ఉన్నా కూడా కొంతమంది చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే బెల్లంకొండ కెరియర్ లో రాక్షసుడు అనే సినిమా మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్ అన్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ అదే హీరో హీరోయిన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కిష్కిందపురి.

‎ డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఈవెంట్ నేడు హయత్ లో జరగనుంది.
‎దర్శకులు అనిల్ రావిపూడి, బాబి, బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా ఈ ఈవెంట్ కి హాజరవుతున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను సినిమాకి కథను అందించింది బాబి. ఈ ముగ్గురు దర్శకులు రేపు జరగబోయే ఈవెంట్ లో కనిపించనున్నారు. మరి వీళ్ళతో సాయి శ్రీనివాస్ కు ఎటువంటి అనుబంధం ఉంది అనేది రేపు వాళ్ళ మాటల్లోనే తెలిసే అవకాశం కూడా ఉంది.