ఏం జరుగుతున్నా ఛార్జ్ తీసుకున్న విష్ణు..ఫోటోలు వైరల్.!

Manchu Vishnu Taking Charge As Maa President Pics Gone Viral | Telugu Rajyam

గత ఆదివారంతో ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “మా ఎన్నికలు” ముగిసిపోయినా ఇప్పటికీ కూడా ఆ రగడ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓ పక్క ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు అంతా రాజీనామా చేస్తున్నా మరోపక్క విజయ కేతనం ఎగురవేసిన మరో ప్యానల్ హెడ్ మంచు విష్ణు మాత్రం తాను సరికొత్త మా అధ్యక్షునిగా ఈరోజు ఛార్జ్ అయితే తీసేసుకున్నాడు.

వారి సభ్యులతో జరిగినటువంటి సన్మానం అనంతరం ఫైల్ లో సంతకం పెట్టి మా కొత్త ప్రెసిడెంట్ గా విష్ణు అయితే ఛార్జ్ తీసేసుకున్నాడు. దీనితో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే నిన్ననే ఈ ఎన్నికలు ఏ స్థాయిలో రీతిలో జరిగాయో తాము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు వాపోయారు. మరి వాటిని ఏం పట్టించుకోకుండా విష్ణు ఛార్జ్ తీసుకోడం కూడా చేసేసాడు. మరి వారు రైజ్ చేస్తున్న సమస్యలను సాల్వ్ చేస్తాడో లేదో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles