Manchu Lakshmi: నెగిటివ్ అంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్న మంచు లక్ష్మి.. బుద్ధుందా అంటున్న నెటిజన్లు!

Manchu Lakshmi: సీనియర్ నటుడు మోహన్ బాబు కూతురుగా, నటిగా, యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మి కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ టైం పాస్ అవ్వడానికి ఏదైనా టాప్ త్రీ మూవీస్, వెబ్ సిరీస్ ఉంటే చెప్పండి అంటూ తను కరోనా బారిన పడిన విషయాన్ని తెలిపారు.

మంచు లక్ష్మి కరోనా బారిన పడక ముందే తన సోదరుడు మంచు మనోజ్ కూడా కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఇలా కరోనా బారిన పడిన మంచు లక్ష్మి హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ గురైంది. అయితే ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే…

ఈ సందర్భంగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తనకు కరోనా నెగిటివ్ అనే విషయాన్ని ఎంతో సంతోష పడుతూ తెలియజేశారు. ఇలా తనకు నెగిటివ్ వచ్చిందని చెప్పిన మంచు లక్ష్మి తన కూతురిని కౌగిలించుకొని తన కూతురికి లిప్ కిస్ చేసింది. దీంతో ఆగ్రహానికి బలై దారుణమైన ట్రోలింగ్ కి గురైంది.ఈ క్రమంలోనే కరోనా నెగిటివ్ వస్తే మంచిదే కానీ మరి కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం బుద్దుందా నీకు చిన్న పిల్లల దగ్గర అలా ప్రవర్తించడం ఏంటి అంటూ తనదైన శైలిలో తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.