Mahesh Babu: పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేస్తూ.. భార్యకు విషెస్ చెప్పిన మహేష్ ఫోటో వైరల్!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వరుస సినిమాలతో దూసుకుపోతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సూపర్ స్టార్ గా మాత్రమే కాకుండా సూపర్ హస్బెండ్, సూపర్ ఫాదర్ గా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.వంశీ సినిమా ద్వారా హీరోయిన్ అమృతతో కలిసి నటించిన మహేష్ బాబు ఈ సినిమాతోనే తనతో ప్రేమలోపడి పెళ్ళి చేసుకున్నారు. ఈ క్రమంలోనే నేటికీ వీరి వివాహం జరిగే సరిగ్గా 17 సంవత్సరాలు కావస్తోంది.

ఈ క్రమంలోనే నేడు మహేష్ నమ్రతల వివాహ వార్షికోత్సవ దినోత్సవం కావడంతో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేస్తూ అప్పుడే 17 సంవత్సరాలు అయిపోయింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నమ్రత.. ఇలా ఎన్నో జరుపుకోవాలి అంటూ తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశారు. ఈ విధంగా మహేష్ బాబు ఈ ఫోటోని షేర్ చేయడంతో పెద్ద ఎత్తున లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి.

ఇలా నేడు తమ అభిమాన హీరో పెళ్లి రోజు కావడంతో ఎంతోమంది అభిమానులు మహేష్ బాబు నమ్రతకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నేడు మహేష్ బాబు సినిమా టికెట్ల రేట్లు వ్యవహారంపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం విజయవాడ చేరుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి రోజు కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీతో గడపకుండా సినిమా ఇండస్ట్రీ కోసం ఈ విధంగా ముఖ్యమంత్రిని కలవడానికి విజయవాడ చేరుకున్నారు.