Varun Tej: వరుణ్ తేజ్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి…ఫోటోలు వైరల్!

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నిన్న (జనవరి 19వ తేదీ)పుట్టినరోజు జరుపుకోవడంతో పెద్దఎత్తున ఈయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని తన ప్రేమ విషయాన్ని ఆమెకు తెలియజేయడం కోసం 25 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ తో బెంగళూరుకు వెళ్లారని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేశాయి. అయితే తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై లావణ్యత్రిపాఠి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి తన కుటుంబంతో కలిసి తన సొంత గ్రామంలో నివసిస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ చెప్పినట్లు తెలుస్తోంది.అయితే వరుణ్ సందేశ్ లావణ్య త్రిపాఠి గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడానికి గల కారణం వీరిద్దరూ కలిసి నటించిన అంతరిక్షం, మిస్టర్ సినిమాలే కారణమని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సందేహాలు వ్యక్తమయ్యాయి.

అదేవిధంగా హీరో వరుణ్ తేజ్ సోదరి నిహారిక వివాహానికి ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోయిన్లు హాజరు కాలేదు కానీ లావణ్యత్రిపాఠి మాత్రమే హాజరు కావడంతో ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఇలా తన గురించి వస్తున్న ఈ వార్తలకు లావణ్య త్రిపాటి ఈ ఫోటోలను షేర్ చేస్తూ పుకార్లకు చెక్ పెట్టారు.