Krithi Shetty: ఉప్పెన సినిమా చూసి ఆ హీరో గిఫ్ట్ పంపించారు.. నిక్ నేమ్ బయటపెట్టిన బేబమ్మ!

Krithi Shetty: గత ఏడాది ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బేబమ్మగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న కృతి శెట్టి గత ఏడాది నాని సరసన శ్యామ్ సింగరాయ్ చిత్రం ద్వారా మరొక విజయాన్ని అందుకున్నారు.ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భాగంగా ఆలీతో సరదాగా ముచ్చటించిన కృతి శెట్టి పలు విషయాలను బయటపెట్టారు.

ఈ కార్యక్రమానికి కృతి శెట్టితో పాటు బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అలీ మాట్లాడుతూ. మీ ముద్దు పేరు బుంగు కదా అని అడగగా అందుకు కృతి శెట్టి ఆశ్చర్యపోతూ మీకు ఎలా తెలుసు అంటూ ప్రశ్నించారు..ఇంత అందంగా పుట్టడానికి మీ ఊర్లో ఏమైనా అమ్ముతున్నారా అంటూ అలీ సరదాగా తనను ఆటపట్టిస్తూ అడగగా అందుకు కృతి శెట్టి అవును మా ఊరి నీళ్లలో ఏదో మిక్స్ అయింది అంటూ సమాధానం చెప్పారు.

ఇక ఉప్పెన సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా లో హీరో వెంట పడినట్లు నిజ జీవితంలో ఎవరైనా వెంట పడ్డారా అని ప్రశ్నించగా అందుకు లేదు అనే సమాధానం చెప్పగా వెంటనే డైరెక్టర్ కృష్ణ పడే ఉంటారు అని సమాధానం చెప్పారు. ఇకపోతే ఉపేంద్ర సినిమా హిట్ అయిన తర్వాత ఒక పెద్ద హీరో తనకు ఫ్లవర్ బొకేతో పాటు గిఫ్ట్ కూడా పంపించారు అనే విషయాన్ని తెలిపారు. అయితే ఆ హీరో ఎవరు అనే విషయాన్ని చెప్పడానికి కృతి శెట్టి వెనకడుగు వేశారు..ఒకవేళ గిఫ్ట్ పంపిన హీరోతో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనిఅలీ ప్రశ్నించగా అందుకు కూడా కృతి శెట్టి సమాధానం చెప్పకపోవడం గమనార్హం..అయితే ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగ రోజు ప్రసారం కానుందని తెలుస్తోంది.