Korataala Shiva: ఆ స్టార్ హీరోల కోసం దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టిన కొరటాల..?

Korataala Shiva:సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇలా ప్రభాస్ తో మిర్చి సినిమాకు ఈయన దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. మీ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ వంటి సినిమాలకు కొరటాల శివ దేవిశ్రీ ప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. ఇలా వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ అయ్యింది.

ఇలా సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకునే కొరటాల శివ టాలీవుడ్ స్టార్ హీరోల మెగాస్టార్ చిరంజీవి,జూనియర్ ఎన్టీఆర్ కోరిక మేరకు దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టి మరొక సంగీత దర్శకులకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి మణిశర్మ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఆచార్య చిత్రానికి చిరంజీవి సూచన మేరకు కొరటాలశివ దేవిశ్రీ ప్రసాద్ ను కాదని మణిశర్మ తీసుకున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ 30 వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాద్ ను పూర్తిగా పక్కన పెట్టేసి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈయన గతంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఈ క్రమంలోనే తారక్ మరోసారి అనిరుద్ ను సూచించడంతో కొరటాల శివ దేవిశ్రీని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇలా ఈ ఇద్దరి కోసం కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ పక్కన పెట్టి మరొకరి అవకాశం ఇచ్చారు.