కత్తి మహేష్ తన స్థాయిని మించి పవన్ కళ్యాణ్ ని తిట్టాడు: కోన వెంకట్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కోన వెంకట్ ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేవలం రచయితగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఈయన ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోన వెంకట్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. పవన్ కళ్యాణ్ తో తనకు బాలు సినిమా ద్వారా పరిచయం ఏర్పడిందని తెలిపారు.

నాగబాబుతో తనకు మంచి పరిచయం ఉందని ఆయన పరిచయం ద్వారానే పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా కోన వెంకట్ వెల్లడించారు. ఇక పంజా సినిమా కోసం నేను పని చేయాలని పవన్ కళ్యాణ్ అడిగినప్పటికీ దర్శకుడు తనకు కథ వివరించకపోవడంతో వేరే వాళ్ళు ఆ సినిమా చేయడంతో తాను తప్పుకున్నానని ఈయన తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాలు కాకుండా మరి ఏదైనా చేయాలని మాట్లాడుతూ ఉండేవారు ఇలా ఆయన సినిమాలు చేస్తూ రాజకీయాలలోకి వచ్చారని కోన వెంకట్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారికి విప్లవ భావజాలం ఎక్కువ. రాజకీయాలపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది.ఈయన రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కత్తి మహేష్ వివాదం జరుగుతున్న సమయంలో ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపిన వ్యక్తి తానేనని కోన వెంకట్ వెల్లడించారు.ఈ క్రమంలోనే కత్తి మహేష్ గురించి మాట్లాడుతూ కత్తి మహేష్ తన స్థాయికి మించి పవన్ కళ్యాణ్ ను తిట్టారు.పవన్ గురించి దారుణమైన కామెంట్ చేశారు. అయితే చివరికి ఏమైంది అంటూ ఈ సందర్భంగా కత్తి మహేష్ గురించి కోన వెంకట్ కామెంట్ చేశారు.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి కత్తి మహేష్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మనకు తెలిసిందే.