Hero Karthikeya: కార్తికేయ విషయంలో నాని సినిమా కలిసి రాలేదు… మరి అతని పుట్టిన రోజైనా కలిసొస్తుందా?

Hero Karthikeya: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించారు. అయితే ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది ఈ క్రమంలోనే హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా హీరో కార్తికేయ ప్రతిసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే హీరోగా పలు సినిమాలలో నటించినా సరైన గుర్తింపు రాకపోవడంతో విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఈ క్రమంలోనే నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరిచిందని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన కార్తికేయ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అజిత్ తో కలిసి తన సినిమాలో విలన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే బోనీ కపూర్ నిర్మాణంలో హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమాలో కార్తికేయ విలన్ గా నటించారు.

ఈ సినిమా ఫిబ్రవరి 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజే హీరో నాని పుట్టిన రోజు కావడం విశేషం. నాని సినిమాలో విలన్ గా నటించడం వల్ల తనకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది అయితే నాని నటించిన సినిమా ప్రేక్షకులను సందడి చేయ లేకపోయినప్పటికీ ఆయన పుట్టిన రోజు విడుదల అవుతున్న ఈ సినిమా అయినా హీరో కార్తికేయకు మంచి ఫలితాన్నిస్తుందా లేదా అనే విషయం గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే హీరో కార్తికేయకు నాని పుట్టినరోజు కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి రెండు రోజులు ఆగాల్సిందే.