Kajal Agarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన అందం అభినయంతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకుంది. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో పెద్ద పెద్ద హీరోల సరసన నటించింది. కాజల్ వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలలో నటించింది. ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన కాజల్ భర్త గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కాజల్ ప్రెగ్నెన్సీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ తీసుకొని తన ప్రెగ్నెన్సీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంది. కాజల్ ప్రస్తుతం దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలలో కాజల్ తన బేబీ బంప్ ఉన్నందున కొందరు ఆకతాయిలు బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ చేశారు. కాజల్ వారందరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది.
తనపై బాడీ షేమింగ్ చేసిన వారికి కాజల్ ఘాటుగా సమాధానం చెబుతూ..”నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులను నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాను. వీటన్నింటిని అర్థం చేసుకోలేని కొందరు మూర్ఖులకు ఈ విషయం చెబుతున్నా.. ప్రెగ్నెంట్ అయ్యాక కొన్ని హార్మోన్ల ప్రాబ్లం వల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.సాధారణంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత శరీర బరువు పెరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా శరీరం సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ఒక్కోసారి శరీరం ఆకృతి సాధారణ స్థితికి రాలేకపోవచ్చు అని కాజల్ పేర్కొంది. ప్రస్తుతం కాజల్ నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పూజా హెగ్డే కూడా నటించారు.