ప్రభుత్వ కార్యాలయాలకు, జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ బిల్డింగులైన సచివాలయాలకు వైకాపా జెండా రంగు అయిన తెలుపు, నీలం, ఆకపచ్చ రంగులు వేయడంపై అభ్యంతరం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షం టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ జెండా రంగులేంటని మండిపడ్డాయి. దీనిపై హైకోర్టులో కేసు వేడయం..కోర్టు ప్రభుత్వానికి మెట్టికాయులు వేయడం..ఆ తీర్పును సవాల్ చేస్త సర్కార్ సుప్రీంకోర్టు వెళ్లడం…అక్కడా మొట్టికాయలు పడటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ వివాదంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు కోర్టు మెట్లు ఎక్కి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
దీంతో రంగులపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ రంగులను అలాగే ఉంచుతూ అదనంగా మట్టిరంగును జోడించిమని ఆదేశాలిచ్చింది. అయితే ఈ రంగుపై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పింది చేయకుండా సొంత నిర్ణయాలు ఏంటని..చేసే పనులన్నీ కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని హెచ్చరించడంతో జగన్ సర్కార్ పూర్తిగా వెనక్కి తగ్గింది. తాజాగా ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు అధికారులకు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రంగులను తొలగించి అన్ని కార్యాలయాలకు కేవలం తెలుపు రంగు వేయాలని ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా విధిగా ప్రతీ కార్యాలయంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
దీంతో అన్ని కార్యాలయాలు ఇకపై తెలుపు రంగులోకి మరానున్నాయని తెలుస్తోంది. వైకాపా జెండా రంగు వేయడం వల్ల దాదాపు 1400 కోట్లు ప్రజాధనం వృద్ధా అయినట్లు ప్రతిపక్షం ఆరోపించింది. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ డబ్బంతా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసి ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉండేదని అభిప్రాయాలొచ్చాయి. వైకాపా ఆ విషయంలో చాలా పెద్ద తప్పు చేసినట్లు విమర్శలు ఎదుర్కుంది. తాజాగా మళ్లీ తెలుపు రంగుకు కొంత బడ్జెట్ కేటాయించాలి. కాబట్టి ప్రభుత్వానికి అదనంగా మరో ఖర్చు తప్పదు.