టాక్ : రాజమౌళి పవన్ ని కలవబోతున్నాడా?ఎందుకోసమో..

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) పనుల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ లెవెల్ ప్రమోషన్స్ కి గాను రాజమౌళి అన్ని ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడు. కానీ సినిమా రిలీజ్ పట్ల కాస్త కంగారు లోనే రాజమౌళి ఉన్నాడు. ఎందుకంటే పోటీ లో పవన్ నటించిన “భీమ్లా నాయక్” వెనక్కి తగ్గకపోతుండడంతో ఏదైనా దెబ్బ పడొచ్చని టాక్ ఉంది.

మరి దీని కోసమో లేక వేరే ఏ ఇతర అంశం కోసమో కానీ రాజమౌళి మాత్రం పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నాడని టాక్ వినిపిస్తోంది, వైరల్ అవుతుంది. అలాగే ఏమో తన భారీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం కూడా కావొచ్చేమో అనీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లోనే ఫిక్స్ అయ్యి ఉన్నాయి.