Raw Banana: సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లోనూ తక్కువ ధరలో లభ్యమయ్యే పండ్లలో అరటిపండు ఒకటి . అరటి పండ్లను రోజు తినడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. పచ్చడి పండు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి అరటికాయ లో విటమిన్ C, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కావాల్సిన శక్తిని ఇవ్వటమే కాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. సీజనల్ గా వచ్చే వ్యాధులు మరియు ఇతర వ్యాధులను రాకుండా నివారిస్తుంది.
ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది డయాబెటిస్ (షుగర్) వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే రోజూ పచ్చి అరటి కాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. పచ్చి అరటిపండు అలాగే తినగలిగే వారు తినవచ్చును..తినలేని వారు వాటిని బాగా కడిగి, చిన్నచిన్న ముక్కలుగా కోసి, ఉడకబెట్టి, రోజూ తినే ఆహారంతో పాటు తినవచ్చు. ఇలా చేయడం వలన షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
అరటికాయల లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, గుండె సమస్యలు రాకుండా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చి అరటి కాయలు తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు రోజా వారి డైట్ లో పచ్చి అరటి పండు చేర్చడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడే అవకాశం ఎక్కువ.
అలసట, నీరసం ఉన్నవారు పచ్చి అరటి కాయలు తినడం వల్ల తక్షణ శక్తి పొందవచ్చు. పచ్చి అరటి కాయలను ఉడకబెట్టి తినటం , పచ్చిగా ఉన్న అరటి కాయలు అలాగే తిన్నా కూడా మంచి ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. పచ్చి అరటి పండు చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని జ్యూస్ చేసి తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి .
