చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలు ఉండాల్సిందే!

ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ కాలుష్యం వల్ల పెద్దా చిన్నా తేడా లేకుండా అందరూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పెద్ద వారితో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉండటం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు రోగాలను వెంటబెట్టుకొని వస్తుంది. శీతాకాలంలో పిల్లలు తరచూ జలుబు , దగ్గు , జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు డాక్టర్ సలహాలతో పాటు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా మంచి ఉపయోగం ఉంటుంది.

ఈ చిట్కాలలో ముఖ్యమైనవి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ,యాక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, మినరల్స్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు తీసుకునే ఆహారంలోడ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా జీడిపప్పు, బాదం, పిస్తా , వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

జీడిపప్పు
మనకు సులభంగా దొరికే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, జింక్, భాస్వరం ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. జీడిపప్పును పిల్లలకు కు స్నాక్స్ లాగా కూడా ఇవ్వవచ్చును. ఇది మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఎండు ద్రాక్ష
ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వీటిని ఇష్టంగా తినేస్తారు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమే కాకుండా, సహజసిద్దంగా జీర్ణక్రియను మెరుగపరుస్తుంది. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు

బాదం
బాదం చిన్న పిల్లల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నానబెట్టిన బాదంను రోజు పిల్లలకు ఇవ్వడం ద్వారా వారిలో ఇమ్యూనిటీ పవర్ చాలా మెరుగుపడుతుంది. అంతేకాకుండా బాదం రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడమే కాకుండా కొలెస్ట్రాల్ ని కూడా నియంత్రిస్తుంది.

వాల్ నట్
వాల్నట్ లలో క్యాల్షియం, మాంగనీస్, పొటాషియంలతో పాటు విటమిన్లు B 1, B 2, B 6 లు ఉంటాయి. చలికాలంలో పిల్లలకు వాల్ నట్స్ తినిపించడం ద్వారా వారి శరీర ఉష్ణోగ్రత పెరిగి ఇమ్యూనిటీని పెంచుతుంది.

పిస్తా
పిస్తాలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనిని పిల్లలు తినడం ద్వారా వాళ్ల ఇమ్యూనిటీపవర్ పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటారు.