Allu Arjun: వామ్మో… భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ఐకాన్ స్టార్.. ఏకంగా ఒక సినిమాకు అన్ని కోట్లా!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మార్కెట్ ఇండియా వైడ్ పెరిగిపోయింది. ఇలా పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లుఅర్జున్ తన తదుపరి చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ పెంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా భారీ స్థాయిలో విజయం అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ అదే స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ కి మరింత క్రేజ్ ఏర్పడడంతో లైకా ప్రొడక్షన్స్ లో అల్లు అర్జున్ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కి ఏకంగా 75 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఇలా వీరు ఇచ్చిన ఆఫర్ అల్లు అర్జున్ కి సమ్మతం కావడంతో ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మొత్తానికి పుష్ప చిత్రం ద్వారా అల్లు అర్జున్ కెరీర్ మారిపోయిందని చెప్పవచ్చు. ఈ విధంగా పుష్ప చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా ఆయనకు మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.ఇలా అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు 75 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారని తెలియడంతో అల్లు అర్జున్ కూడా ప్రభాస్ రేంజ్ కి చేరుకున్నారని తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచి పుష్ప పార్ట్ 2 చిత్రీకరణ మొదలు కానున్నట్లు సమాచారం.