Sukumaar: ఈసారి అలాంటి తప్పు చేయను.. పుష్ప విషయంపై క్లారిటీ ఇచ్చిన సుకుమార్!

Sukumaar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ అన్ని భాషలలో విడుదల ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా థియేటర్ రన్ అవుతుండగానే ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ భారీ ధరకు కైవసం చేసుకుంది. ఈ క్రమంలోని నేటి నుంచి (జనవరి7) ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇకపోతే పుష్ప మొదటి పార్ట్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో సుకుమార్ ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2 వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం చేయబోతున్నట్లు మనకు తెలిసినదే. అయితే పుష్ప పార్ట్ 1 కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించి పెద్ద తప్పు చేశానని సుకుమార్ భావించారు. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు సంవత్సరం సమయం వృధా చేసినట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి తప్పు చేయకుండా పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎడిటింగ్‌పై తగినంత సమయాన్ని కేటాయించడం వల్ల సినిమా విజయానికి దోహదపడుతుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్ తో సుకుమార్ పుష్ప పార్ట్ 2 షూటింగ్ మొదలు పెడుతున్నారు. మరి ఈయన ప్లాన్ అనుకున్న విధంగా అమలు చేస్తారా లేదంటే ఇతని ప్లాన్ కు కరోనా అడ్డుకట్ట వేస్తుందో తెలియాల్సి ఉంది.