Rahul Ramakrishna: ఇకపై సినిమాలలో నటించను… కమెడియన్ రాహుల్ రామకృష్ణ!

Rahul Ramakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన అర్జున్ రెడ్డి, గీతగోవిందం, భరత్ అనే నేను వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. అదేవిధంగా గత ఏడాది జాతిరత్నాలు సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.

ఇలా ఇండస్ట్రీలో తనకు మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఈయన తన కెరీర్ గురించి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను ఇండస్ట్రీలో కొనసాగలేనని ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇలా రాహుల్ రామకృష్ణ సినిమాల్లో నటించనని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

రాహుల్ రామకృష్ణ సినిమాలలో నటించినని చెప్పినప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగక పోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.అయితే ఈయన తీసుకున్న ఈ నిర్ణయం కేవలం సినీ ప్రేమికులను మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడంతో ఆయన కెరియర్ ఎంతో అద్భుతంగా ఉండబోతుందనుకున్న సమయంలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.