Sruthi Haasan: తనకు ముందుగా నేనే ఐలవ్యూ చెప్పాను.. అసలు విషయం బయట పెట్టిన శృతిహాసన్!

Sruthi Haasan: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న శృతి హాసన్ ఆ తర్వాత అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఇలా కొన్ని రోజులపాటు ఇండస్ట్రీలో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ తిరిగి గత ఏడాది రవితేజ క్రాక్ సినిమా ద్వారా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో శృతిహాసన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శృతి హసన్ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ శంతను హజారికాతో ఎంతో చనువుగా ఉంటూ వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తనతో డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ అభిమానులతో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఈ క్విజ్ లో భాగంగా శృతి హాసన్ తో పాటు హజారికా కూడా పాల్గొన్నారు. ఇలా నెటిజన్లు వీరిద్దరిని పలు ప్రశ్నలు అడుగుతూ ముందుగా మీ ఇద్దరిలో ఎవరికి ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు అనే ప్రశ్న అడిగారు.ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ నేనే అతనికి ముందుగా ఐ లవ్ యు చెప్పానని అసలు విషయం బయట పెట్టారు. అలాగే మీ ఇద్దరిలో ఎవరు ప్రొటెక్టివ్ గా ఉంటారు అని అడగడంతో వీరిద్దరు ఒకరివైపు మరొకరు చూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.