Priyamani: దక్షిణాది సినీ ఇండస్ట్రీలోఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సినీ తారలలో నటి ప్రియమణి ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఒకనొక సమయంలో ఎంతో బిజీగా ఉన్న ప్రియమని అనంతరం పలు టీవీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ప్రస్తుతం ఈమె పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో మరి బిజీ అయ్యారని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ప్రియమణి నటిస్తున్న భామా కలాపం అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రియమణి తన గురించి కామెంట్స్ గురించి స్పందించారు. ఒకానొక సమయంలో తనకు ఏ విధమైనటువంటి సినీ అవకాశాలు లేకపోవడం వల్లే బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయని అయితే ఇలా విమర్శించిన వారి కన్నా నన్ను ప్రోత్సహించడం వారే ఎక్కువగా ఉన్నారని ప్రియమణి తెలిపారు.
ఇకపోతే నేను పెద్దగా ఈ విధమైనటువంటి కామెంట్స్ గురించి ఏమాత్రం పట్టించుకోని ఎందుకంటే నాకు యూట్యూబ్ చూసే అలవాటు ఏమాత్రం లేదని అందుకే నేను ఈ కామెంట్స్ గురించి పట్టించుకోనని తెలిపారు.కొంతమంది యూట్యూబ్ కామెంట్స్ కోసమే చూస్తారని తాను మాత్రం ఏదైనా తనకు సంబంధించిన ఎపిసోడ్ చూడటం మిస్ అయితే తప్ప యూట్యూబ్ చూడని ఈ సందర్భంగా ప్రియమణి తెలియజేశారు . ఇక తన గురించి ప్రశంసలు కురిపించిన వారిని విమర్శలు చేసే వారిని సైతం తాను ప్రేమిస్తానని ఈ ముద్దుగుమ్మకు వెల్లడించారు.