Rajeev Kanakaala: RRRలో నా పాత్ర ఎలా ఉండబోతుందంటే.. ఆయన మాటల్లోనే..?

Rajeev Kanakaala: డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నారు.ఆయనది ఒక రాక్షస జాతి అని, దేవతలను తయారు చేస్తుంది అని రాజీవ్ కనకాల అన్నారు. తాను ఒకప్పుడు సీరియల్ షూటింగ్‌లో తాను ఉన్నపుడు రాజమౌళి గారు తనకు కొనకు సీన్లు వివరించారని, ఇప్పుడు బాహుబలి సినిమాలో చూస్తే అప్పుడు చెప్పిన సీన్‌ ఇప్పుడు ఈ సినిమాలో చూశానా అని అనిపించిందని ఆయన చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఆయనకు ఎప్పటినుంచో ఐడియా ఉందని ఆయన తెలిపారు. 24గంటలూ కూడా ఆయన సినిమా గురించే ఆలోచిస్తారన్న రాజీవ్ కనకాల, అంత సినిమా పిచ్చోడ్ని తాను ఇంత వరకూ చూల్లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆ తర్వాత వాళ్లిద్దరూ కలిసి చేసిన శాంతి నివాసం సీరియల్ షూటింగ్ తర్వాత కూడా వాళ్లిద్దరూ కలిసి ఓ గంట, గంటన్నర వరకూ మాట్లాడుకునే వారిమని రాజీవ్ కనకాల తెలిపారు. రాజమౌళి ముఖ్యంగా ఒక మంచి శ్రోతను చూసుకుంటాడన్న ఆయన, వినేవాడు ఎంజాయ్ చేస్తేనే కదా చెప్పేవాడు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చెప్తాడు అని ఆయన అన్నారు. ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను ఎలా అభిమానిస్తామో, అతను ప్రేమించినట్టుగా ఇంకెవరూ అలా అభిమానించరు అని, అంతగా హీరోను హైప్ చేస్తారని ఆయన తెలిపారు. నిజంగా ఆయన గ్రేట్ అని. ఆయన పట్టుకుందల్లా బంగారం అయిపోతుందని రాజీవ్ కనకాల వ్యాఖ్యానించారు.

ఇకపోతే RRR సినిమాలో తన క్యారెక్టర్ గురించి తాను ఇప్పుడేం చెప్పలేనని, దీని గురించి జక్కన్నకు తెలిస్తే వాయించి అవతల పారేస్తారని రాజీవ్ కనకాల అన్నారు. ఎవరిచ్చారు పర్మిషన్ ? నేనిచ్చానా ఏంటీ ? నేను చెప్పినపుడు చెప్పు అని అంటారని. అప్పుడు తాను ఈ విషయంపై మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు