పవన్ సినిమాకు అమ్మాయిలు కుదిరారు

Heroines finalized for Pawan, Rana movie

Heroines finalized for Pawan, Rana movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రాల్లో మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కూడ ఉంది. పవన్, రానాలు కలిసి చేస్తున్న మల్టీస్టారర్ ఈ చిత్రం. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ కాంబినేషన్ మూలంగా సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఒరిజినల్ వెర్షన్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తారు. ఇప్పటికే షూటింగ్ మొదలై 40 శాతం పూర్తైంది కూడ.

అయితే మొదటి నుండి ఇందులో హీరోయిన్లు ఎవరనేది పెద్ద చర్చగా మారింది. నిజానికి ఒరిజినల్ హీరోయిన్లకు అంతగా స్కోప్ ఉండదు. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు హీరోయిన్ల పాత్రలను కొంచెం పెంచి ఉండొచ్చు. మొదట మేకర్స్ చాలా ఆసక్తిగా సాయి పల్లవిని అప్రోచ్ అవ్వగా డేట్స్ క్లాష్ అవుతున్న కారణంగా ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారు. అలాగే మరొక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను ఫైనల్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో పవన్ జోడీ ఎవరు, రానా జంట ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.