‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
తన తండ్రిని ఒప్పిస్తూ“ఇడ్లీ గ్రైండర్ కొంటే పని తేలిక అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది” అని చెప్పే సన్నిశంతో మొదలైన ట్రైలర్ అధంత్యం ఆకట్టుకుంది. ధనుష్ ఈ సినిమాలో మురళి పాత్రలో నటిస్తున్నారు. తన తండ్రి దగ్గర ఉన్న సంప్రదాయ ఇడ్లీ కొట్టు మీద మురళికి చాలా అనుబంధం ఉంటుంది. ఆ ఇడ్లీ బండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందరికీ చాలా సెంటిమెంట్.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు అనిత, ఆనం
మురళి హోటల్ మేనేజ్‌మెంట్ లోకి వెళ్లి, అరణ్ విజయ్ చేసిన అశ్విన్ పాత్రతో కలిసి పనిచేస్తాడు. వ్యాపారం లాభాలు పెరగడానికి మురళి సహాయం చేస్తాడు. కానీ అశ్విన్ నుంచి వచ్చే బెదిరింపులు మురళి భవిష్యత్తు మాత్రమే కాదు, తన తండ్రి పేరు, వారసత్వానికి సవాల్ గా మారుతాయి. దాంతో మురళి ఎదుర్కోబోయే సవాళ్లు, తన గౌరవం కోసం చేసే పోరాటమే కథలో ప్రధానంగా మారుతుంది.
ట్రైలర్ లో ధనుష్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. తన పాత్రలో వేరియేషన్స్ ని అద్భుతంగా చూపించారు. నిత్యా మీనన్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి కెమిస్ట్రీ డిఫరెంట్ గా వుంది. అరణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్ పాత్రలు కూడా కీలకంగా వున్నాయి.
డైరెక్టర్ గా ధనుష్ హార్ట్ టచ్చింగ్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. G.V ప్రకాష్ కుమార్ బీజీఎం ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. కిరణ్ కౌశిక్ కెమరా వర్క్ బ్రిలియంట్ గా వుంది. డాన్ పిక్చర్స్ & వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు ఉన్నంతంగా వున్నాయి. ట్రైలర్ ఇడ్లీ కొట్టు అంచనాలుని మరింతగా పెంచింది.
శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
ఇడ్లీ కొట్టు తెలుగు, తమిళ్ లో అక్టోబర్ 1న రిలీజ్ కానుంది.
నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: ధనుష్
నిర్మాతలు: ఆకాష్ బాస్కరన్ & ధనుష్
బ్యానర్: డాన్ పిక్చర్స్ & వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్
తెలుగు రిలీజ్: రామారావు చింతపల్లి శ్రీ వేదక్షర మూవీస్
సంగీతం: G.V ప్రకాష్ కుమార్
ఎడిటర్: G.K ప్రసన్న
DOP: కిరణ్ కౌశిక్
యాక్షన్: పీటర్ హెయిన్
ఆర్ట్: జాకీ
డాన్స్ కొరియోగ్రాఫర్: సతీష్
పబ్లిసిటీ డిజైన్: కబిలన్
ప్రొడక్షన్ కంట్రోలర్: డి.రమేష్ కూచిరాయర్
మ్యూజిక్ అండ్ డిజిటల్ పార్ట్నర్ – సరేగామ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రేయాస్ శ్రీనివాసన్
పీఆర్వో : వంశీ శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


