చిత్రం: ఇడ్లీ కొట్టు
విడుదల తేదీ: అక్టోబర్ 1, 2025
నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సముద్రఖని, సత్యరాజ్
దర్శకుడు: ధనుష్
నిర్మాతలు: ఆకాష్ బాస్కరన్, ధనుష్
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
స్కూటీపై వెళుతున్న మైనర్లకు క్లాస్, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని పోలీసులకు హోంమంత్రి అనిత ఆదేశం!
క్రికెటర్ తిలక్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ
Idly Kadai Movie Review: హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’ ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
కథా నేపథ్యం: శంకరాపురం అనే చిన్న గ్రామంలో ‘ఇడ్లీ కొట్టు‘ (Idly Kadai) నడుపుకునే శివ కేశవుడు (రాజ్ కిరణ్) జీవితాన్ని సంతృప్తితో గడుపుతుంటాడు. ఆయన కొడుకు మురళీ (ధనుష్) (Dhanush) మాత్రం గొప్ప కలలు కని, బ్యాంకాక్‌లో ఫుడ్ బిజినెస్ మెన్ విష్ణు వర్ధన్ (సత్యరాజ్) వ్యాపార అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడు. విష్ణు వర్ధన్ కూతురు మీరా (షాలిని పాండే)తో పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. ఇలాంటి సమయంలో మురళీ జీవితంలో ఎదురైన రెండు తీరని విషాదాలు అతన్ని తిరిగి తన ఊరికి, తన తండ్రి ఇడ్లీ కొట్టు వద్దకు రప్పిస్తాయి. అక్కడ నుంచి మురళీ తన ఇడ్లీ కొట్టును మళ్లీ ఎలా మొదలుపెట్టాడు? ఈ క్రమంలో కల్యాణి (నిత్యా మీనన్) ఎలా సహాయపడుతుంది? విష్ణు వర్ధన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్) మురళీని ఎందుకు ద్వేషిస్తాడు? చివరికి మురళీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ధనుష్ ఈ సినిమా ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ధనుష్ నటన, దర్శకత్వం: సినిమాకు ప్రధాన బలం ధనుష్. నటుడిగా తన పాత్రలో లేయర్స్ చూపించడంలో, మాస్ మూమెంట్స్‌లో అదరగొట్టాడు. దర్శకుడిగా తను ఎంచుకున్న సింపుల్ కథకు అల్లుకున్న భావోద్వేగ కథనం బాగుంది.
ఎమోషనల్ పార్ట్: మొదటి సగంలో ధనుష్ (Dhanush) డిజైన్ చేసిన భావోద్వేగ సన్నివేశాలు, మంచి డైలాగ్స్ ఆడియెన్స్‌ను హత్తుకునేలా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి.
నటీనటుల ప్రదర్శన: రాజ్ కిరణ్ ‘శివ కేశవుడు’ పాత్రలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధనుష్-నిత్యా మీనన్ కెమిస్ట్రీ ‘తిరు’ సినిమా తర్వాత మళ్లీ ఆకట్టుకుంది. నిత్యా మీనన్ పల్లెటూరి అమ్మాయిగా బాగా చేసింది. షాలిని పాండే, సత్యరాజ్, అరుణ్ విజయ్, సముద్రఖని కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సందేశం: పుట్టిన ఊరు, తల్లిదండ్రుల పట్ల ధనుష్ ఇవ్వాలనుకున్న సందేశం స్పష్టంగా, నీట్‌గా ఉంది.
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ పేస్: బలమైన ఫస్టాఫ్ తర్వాత, సెకండాఫ్‌లో ఎమోషనల్ ఫ్లో కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది.
తమిళ నేటివిటీ: సెకండాఫ్ ఆరంభంలో కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు కొంచెం డ్రమాటిక్‌గా, తమిళ నేటివిటీకి దగ్గరగా అనిపించవచ్చు.
రొటీన్ ఫీల్: అరుణ్ విజయ్ పాత్ర, సత్యరాజ్ తో అతని సన్నివేశాలు ‘రఘువరన్ బీ టెక్’ తరహాలో కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం: నిర్మాణ విలువలు బాగున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం, పాటలు సందర్భానుసారం బాగున్నాయి. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ సిటీ, పల్లెటూరి దృశ్యాలను అందంగా బంధించింది. ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్, మాటల తర్జుమా బాగా కుదిరాయి. దర్శకుడిగా ధనుష్ ప్రయత్నం ప్రశంసనీయం.
తీర్పు:
మొత్తంగా, ‘ఇడ్లీ కొట్టు‘ (Idly Kadai) అనేది కాస్త నెమ్మదిగా సాగే (స్లో పేస్డ్), కానీ డీసెంట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా ధనుష్ (Dhanush) భావోద్వేగ అంశాలను బాగా పండించారు. నటీనటులందరూ మంచి ప్రదర్శన ఇచ్చారు. అయితే, ఫస్టాఫ్ లో ఉన్నంత ఎమోషనల్ పట్టు సెకండాఫ్‌లో కొద్దిగా తప్పింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు, ఎలాంటి అంచనాలు లేకుండా ఈ దసరా వారాంతంలో ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు.
తెలుగు రాజ్యం రేటింగ్ : 2.75/5




