ఓ వంతెన కూలి 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి, అది సాధారణ వంతెన కాదు.! పర్యాటకుల్ని ఆకర్షించే వంతెన. అది కూడా పురాతనమైనది.. అందునా కేబుల్ వంతెన.!గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపైనున్న తీగల వంతెన కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మానవప్పిదం వల్లనే జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తోంది.
ఈ వంతెనుక వందేళ్ళపైనే చరిత్ర వుంది. బ్రిటిష్ హయాంలో ఈ వంతెన నిర్మించారట. దానికి ఇటీవలే మరమ్మత్తులు కూడా చేశారు. ఏడు నెలలపాతు మరమ్మత్తులు చేసి, ఇటీవల వంతెననపైకి సందర్శకుల్ని అనుమతించడం ప్రారంభించగా, ఇంతలోనే వంతెన కూలిపోయింది.
వంద మందిని మోయగల సామర్థ్యం. సమారు 100 మందిని మోయగల సామర్థ్యం ఈ వంతెనకు వుంటే, 400 మందికి పైగా సందర్శకులు ఒకే సమయంలో వంతెన మీద వున్నారు. మరోపక్క, కొందరు ఆకతాయిలు వంతెనను బలంగా ఊపే ప్రయత్నం చేశారట. దాంతో, వంతెన కూలిపోయిందని ప్రాథమికంగా అభిప్రాయపడుతుండడం గమనార్హం.
అయినా, ఊపితే వంతెన కూలిపోవడమేంటి.? అదే మరి మ్యాజిక్ అంటే. తీగల వంతెన.. పైగా, సామర్థ్యం తక్కువ వున్న వంతెన కావడంతోనే ఈ దుస్థితి. మరి, ఏడు నెలలు కష్టబడి వంతెనకు మరమ్మత్తులు చేపట్టడమేంటి.? జస్ట్ రంగులు వేసి ఊరుకున్నారా.? సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదా.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది ప్రభుత్వ వైఫల్యం. ఎవరో ఊపితే వంతెన కూలిపోయిందని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.