ఆ డైరెక్టర్ ని పదివేలు ఇవ్వమని అడిగిన గోపిచంద్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే?

టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గోపీచంద్ ఇటీవల సిటీమార్ సినిమాలో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ తాజాగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. దర్శకుడు మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ పక్కా కమర్షియల్ సినిమా రేపు నెల అనగా జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇక ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచింది. మరొకవైపు చిత్రబృందం వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో గోపీచంద్ తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఆ ఇంటర్వ్యూ సాగింది. ఇంటర్వ్యూ లో భాగంగా సదరు యాంకర్ ఎవరికైనా కాల్ చేసి రీజన్ చెప్పకుండా పదివేలు అడగమని చెప్పగా..

అప్పుడు గోపీచంద్ వెంటనే డైరెక్టర్ మారుతి కి ఫోన్ చేశారు. మారుతి.. నాకు అర్జెంట్ గా 10 వేలు కావాలి.. ట్రాన్స్ఫర్ చేయగలవా? అని గోపీచంద్ అడగ్గా.. కాల్ లో ఉన్న మారుతి పది వేలా?అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పది లక్షలు అన్నట్లు చెప్పారేంటి అని నవ్వుతూ.. వెంటనే గోపీచంద్ అడిగిన అమౌంట్ ను అని పంపించారు. ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్, మారుతి మధ్య ఫోన్ సంభాషణ నవ్వు తెప్పిస్తుంది. ఈ సందర్భంగా రీజన్ చెప్పకుండా ఐదు లక్షలు అడిగినా మారుతి ట్రాన్స్ఫర్ చేస్తాడు అని గోపీచంద్ చెప్పడంతో వారి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పక్కా కమర్షియల్ సినిమాలో హ్యాండ్సమ్ గా ఫిట్ గా కనిపించాను అంటే అందుకు గల కారణం దర్శకుడు మారుతి మరియు కెమెరామెన్ కరమ్ చావ్లాకే లే అని చెప్పుకొచ్చాడు గోపీచంద్.