ఈనాడు vS ఆంధ్రజ్యోతి ఇదొక ఊహించని యుద్ధం..!

మీడియా అనేది ఒకప్పుడు సమాచారం ఇవ్వడానికి ఉండేవి. కానీ ఇప్పుడు మీడియా కూడా ఒక వ్యాపారంగా మారింది. ఒక మీడియా సంస్థ మరో మీడియా సంస్థతో పోటీ పడుతుంది. పత్రికల పంపిణీ పెరగడం కోసం, టీఆర్పీ రేటింగ్స్ కోసం జనాలకు సమాచారం ఇవ్వాడనికి బదులు వాళ్ళను ఎమోషనల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జనాలను ఎమోసిన లైజ్ చేయడానికి ప్రతి మీడియా సంస్థ ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు కరోనా వల్ల తెలుగు పత్రికలైన ఈనాడు,ఆంధ్రజ్యోతి మధ్య ఒక రకమైన యుద్ధం జరుగుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులు పత్రికల ప్రింటింగ్ ఆగిపోయింది.

ఆ తరువాత మళ్లీ ప్రింటింగ్ ప్రారంభమైనా చాలా పత్రికలు అరకొరగా ప్రింట్ చేస్తున్నాయి. కొన్ని పత్రికలు ప్రింటింగ్ ప్రస్తుతానికి నిలిపివేసాయి. ఇలాంటి నేపథ్యంలో అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడుకు చాలా సమస్యలు చుట్టుముట్టాయి. ఒకటి ప్రకటనల ఆదాయం తగ్గడం, రెండు న్యూస్ ప్రింట్ ను జాగ్రత్తగా వాడుకోవాల్సి రావడం. ఈ రెండు సమస్యలను ఒకేసారి అధిగమించేందుకు వీలుగా చాలా పత్రికల మాదిరిగానే ఈనాడు కూడా వీలయినంత వరకు పేజీలు తగ్గించి, ఖర్చులు తగ్గించి, న్యూస్ ప్రింట్ ను ఆదా చేస్తోంది. ఎప్పుడయితే ప్రకటనలు తగ్గాయో, పత్రిక ప్రింట్ ఖర్చుకు రాబడికి మధ్య తేడా పెరుగుతుందో నష్టాలు వచ్చే ప్రమాదం వుంది.

అయితే ఈనాడుకు ఉన్న కష్టాలను ఆంధ్రజ్యోతి పత్రిక తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. తనకు నష్టం వచ్చినా పరవాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఈనాడు వెళ్లని మారుమూల గ్రామాలకు కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికను పంపిస్తున్నారు. అలాగే బిల్లుల విషయంలో ఈనాడు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తోంది. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి బిల్లులు లేట్ గా ఇచ్చినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తూ ఈనాడును దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈనాడు పాఠకులను తనవైపు తిప్పుకోవడానికి ఆంధ్రజ్యోతి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ మీడియా సంస్థల గొడవ ఎక్కడిదాక వెళ్తుందో వేచి చూడాలి.