బాబా మాస్టర్ కి దక్కిన ఎవిక్షన్ ఫ్రీ పాస్… ఎవరిని సేవ్ చేయనున్నారు?

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా గత సీజన్ కంటెస్టెంట్ లో హాజరవుతూ ప్రస్తుతమున్న హౌస్ మేట్స్ తో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని ఆడించారు. ఈ క్రమంలోనే గత సీజన్ విన్నర్ సన్నీ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ కంటెస్టెంట్ లతో కలిసి పెద్ద ఎత్తున చేసి అందరినీ సందడి చేశారు. ఇకపోతే సన్నీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని ఆడించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఫన్నీ గతంలో తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

గత సీజన్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని వాళ్ల అమ్మ కళావతి తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా సన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో భాగంగా బాబా భాస్కర్ మాస్టర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నారు. ఇక ఈయన ఫ్రీ ఫాస్ గెలుచుకోవడంతో మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి సన్ని మాట్లాడుతూ మా సీజన్ లో నేను ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్నప్పుడు మిగిలిన కంటెస్టెంట్ లు ఎవరు సంతోషంగా లేరని తెలియజేశారు.

బాబా భాస్కర్ మాస్టర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి కోసం ఉపయోగిస్తారు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వారం బాబా భాస్కర్ మాస్టర్ తనకు వచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగిస్తారా? ఒకవేళ ఉపయోగించినా ఎవరికోసం ఉపయోగిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ వారంలో బాబా భాస్కర్ మాస్టర్ నామినేషన్ లో కనుక ఉంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తనకోసమే ఉపయోగించుకునేవారు.మరి ఈయన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఎవరిని సేవ్ చేస్తారో తెలియాల్సి ఉంది.