Attacked With Egg: రాజకీయ నాయకులకు విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అవి కేవలం మాటల యుద్ధం వరకే జరుగుతూ ఉంటాయి. అంతేకానీ వస్తువుల దాడితో మాత్రం అస్సలు ఉండదు. కానీ తాజాగా ఒక రాజకీయ నాయకుడికి ఏకంగా కోడిగుడ్లతో దాడి జరిగింది. ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.
ఫ్రాన్స్ కు చెందిన ఫార్ రైట్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎరిక్ జెమ్మూర్ గతంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో దివ్యాంగ పిల్లలు సాధారణ ప్రభుత్వ పాఠశాలలకు బదులు ప్రత్యేక పాఠశాలలకు వెళ్లాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో దివ్యాంగ పిల్లలు ఇతరుల పిల్లలచే ఇబ్బందులకు గురవుతారని.. అతను అలా అనడం కరెక్ట్ కాదని.. తాజాగా అతడు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఓ వ్యక్తి వెంబడించి కోడిగుడ్లతో దాడి చేశాడు. ఇక అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవ్వగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
▶️Éric Zemmour a été visé par un œuf qu’un homme lui a claqué sur la tête à son arrivée à Moissac, où le candidat d’extrême droite battait campagne samedi matin pour la présidentielle pic.twitter.com/oChOUxVBcU
— LN24 (@LesNews24) March 12, 2022