Health Tips: పాలు పాల ఉత్పత్తులను ఈ పండ్లతో కలిపి తీసుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Health Tips:పాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి రోజు మనం తీసుకునే ఆహార పదార్థాలలో పాలు కూడా ఒకటి. పాలలో అధికమొత్తంలో విటమిన్ డి, ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం ఉంటాయి. పిల్లలు, పెద్దలు, యువతి యువకులు అందరూ ఇష్టపడే పాలు. పిల్లల ఎదుగుదలలో పాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెద్దలలో కూడా ఎముకల పటిష్టనికి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రోజులో 2 నుండి 3 సార్లు పాలను త్రాగటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

అయితే పాలను ఎప్పుడు పడితే అప్పుడు తాగకపోవడం మంచిది అని సూచిస్తున్నారు. మన దేశంలో ఆయుర్వేదానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదం ప్రకారం పాలను రాత్రిపూట నిద్ర పోవడానికి ముందు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది పెద్దలకు మాత్రమే. పిల్లలు అయితే ఉదయం పూట పాలు తాగడం మంచిది అని చెబుతున్నారు. పెద్దలు రాత్రి పూట పాలు తాగడం వల్ల శరీరానికి ఎక్కువ మోతాదులో కాల్షియం లభిస్తుంది, బాగా నిద్ర పడుతుంది. క్రమం తప్పకుండా పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండెల్లో మంట, ఇతర గుండె సమస్యలకు పాలు త్రాగడం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఎక్కువ ప్రొటీన్లు పొందటానికి చాలామంది రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆహారపదార్థాలను ఒకేసారి తింటుంటారు. పాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు అవేంటో ఒకసారి చదివేయండి.

• పాలను ఎప్పుడు మాంసంతో కలిపి తాగకూడదు. మాంసంతో పాటు పాలు తాగితే కడుపు ఉబ్బరం, ఇంకా జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి.
• పాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పాలు జీర్ణం అవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. పాలతో పాటు పుల్లగా ఉండే పళ్ళు, ఇతర సిట్రస్ ఫ్రూట్స్ తో కలిపి తాగకూడదు. పాలలో నిమ్మరసం పిండి కూడా అసలు తాగకూడదు. పాలలో పుల్లటి పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియ మీద ప్రభావం చూపి గుండె మంట, కడుపులో మంట కు దారితీస్తుంది.
• ముల్లంగి తో పాటు పాలు తీసుకుంటే అది శరీరంలోని వేడిని పెంచి జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది.
• అరటి పండ్లు, పాలు కలిపి తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఆహారం అరగటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది ఫలితంగా ఎక్కువగా అలసి పోయినట్టు అనిపిస్తుంది. మీరు కచ్చితంగా పాలు, అరటి పండ్లు తీసుకోవలి అనుకుంటే అందులో కొంచెం దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకోవడం శ్రేయస్కరం.