Naveen Polishetty: నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Naveen Polishetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో నవీన్ పొలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి, ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక ఆ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఆ దర్శకుడు అనుదీప్ కె.వి సీక్వెల్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఆ విషయంలో క్లారిటీ రాలేదు. అంతేకాకుండా ఇటీవలే అనుష్క శెట్టి తో నవీన్ పోలిశెట్టి సినిమా హాల్డ్ లో ఉంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఆ సినిమా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని కూడా వార్తలు వినిపించాయి. అలాంటి వార్తలకు యు.వి.క్రియేషన్స్ పులి స్టాప్ పెట్టేసింది. ఇక ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్ లో కూడా నవీన్ పోలిశెట్టి ఒక సినిమాను చేయబోతున్నట్లు ఇటీవలే అఫిషియల్ గా మరొక క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమాలకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే రాబోయే సినిమాల కోసం నవీన్ పోలిశెట్టి తన రెమ్యునరేషన్ ను పెంచేసినట్టు తెలుస్తోంది.

ఇక ఆ సినిమాల కోసం నవీన్ పొలిశెట్టి 5 నుంచి 6 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి నటుడిగా తన మూడవ సినిమా నుంచి ఇంత భారీ పారితోషికం అందుకుంటుండడంతో ప్రస్తుతం ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి నవీన్ పోలిశెట్టి నటించిన జాతిరత్నాలు సినిమాతో అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది అని చెప్పవచ్చు.ఇక నిర్మాతలు కూడా నవీన్ పొలిశెట్టి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. నవీన్ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా కూడా చేయాల్సి ఉంది.