Health Tips: మన శరీరంలో మూత్ర విసర్జన వ్యవస్థ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని నీటి స్థాయిని నియంత్రించి స్థిరంగా ఉంచుతుంది. అంతేకాకుండా రక్తాన్ని వడకట్టి విషపదార్థాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే కొందరిలోఈ కిడ్నీ వ్యాధి కారణంగా శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అవి చర్మంపై దురద రావడం పగుళ్ళు, పొలుసు లాంటి సమస్యలు ఏర్పడతాయి. దీని కారణంగా చర్మం చాలా తెల్లగా మారుతుంది. శరీరంలో విటమిన్లు ఇంకా అలాగే ఖనిజ లోపం కూడా ఏర్పడుతుంది.దీని కారణంగా గోర్లులో తెల్లటి మచ్చలు వచ్చి బలహీనంగా మారుతాయి.
కిడ్నీ వ్యాధి కారణంగా చేతులు ఇంకా కాళ్లు వాపులు కూడా మొదలవుతాయి. ఇంకా వెన్ను నొప్పి అలాగే కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.ముఖ్యంగా టాయిలెట్ కి వెళ్ళినప్పుడు చాలా మంటగా ఉంటుంది. రక్తపోటు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక మీ కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు….
శరీరాన్ని ఎప్పుడూ కూడా పూర్తి హైడ్రేట్ గా ఉంచుకోండి. అలాగే ఎక్కువగా నీటిని, ద్రవపదార్థాలు తీసుకోవడం వలన డీహైడ్రేషన్ సమస్య ఉండదు.
బ్లడ్ షుగర్ ని నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కిడ్నీల పైన ప్రభావం తగ్గుతుంది. అలాగే రక్తపోటు సమస్యను కూడా నియంత్రణలో ఉంచుకోవడం చాలా మంచిది.ఆల్కహాల్, ధూమపానలకు దూరంగా ఉండటం వల్ల కాలేయం మూత్రపిండాలును ఆరోగ్యంగా ఉంచవచ్చు.
శరీరంలోని అన్ని భాగాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం 30 నిమిషాల పాటు వ్యాయామం, అలాగే 7 నుంచి 8 గంటలపాటు నిద్ర చాలా ముఖ్యం. వీటితో పాటు పోషక విలువలు కలిగిన ఆహారం, నీటి శాతం ఎక్కువగా కలిగిన పదార్థాలు తీసుకోవడం శరీరానికి మంచిది.