ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుంటారు. అది బహిరంగ రహస్యమే. అయినా, రాజకీయాల్లో మతంతో సంబంధమేంటి.? టీడీపీ అధినేత చంద్రబాబు.. వివిధ మతాలకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అయినా, మరో రాజకీయ నాయకుడైనా.. తమ మతం ఏదైనా, ఇతర మతాల్నీ గౌరవించాల్సిందే.
ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక, తాను ఫలానా మతానికి మాత్రమే పరిమితం.. అని ఎవరూ అనలేరు. ఇక, అసలు విషయానికొస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను అర్థరాత్రి వేళ ఏసుక్రీస్తుతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారులతో చెప్పారంటూ ఓ వెకిలి రాత రాశారు టీడీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ పత్రికాధినేత. ఆ పత్రిక నుంచి ఇలాంటి దారుణమైన రాతలు సర్వసాధారణమే. ఏ అధికారి ఈ విషయాన్ని లీక్ చేశారో కూడా, సదరు పత్రికాధినేత వెల్లడిస్తే బావుండేది. ఏసుక్రీస్తు ప్రస్తావనను వైఎస్ జగన్ తీసుకురావడంతో, ఓ మాజీ అధికారి బెదిరిపోయారట వైసీపీలో చేరే విషయమై.
ఇది ఇంకా దారుణమైన అభాండం. అసలు ఇలాంటి రాతలు ఎలా రాయాలనిపిస్తుందో ఏమో. ఓ రకంగా ఈ తరహా రాతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేలు చేస్తాయి. రేప్పొద్దున్న వైఎస్సార్ కాంగ్రెస్ సార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఏదన్నా వాస్తవం సదరు పత్రికల్లో వచ్చినా, జనం నమ్మే పరిస్థితి వుండదు మరి. కాగా, వెకిలి పలుకు మీద మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తనదైన దూషణలతో విరుచుకుపడ్డారు సదరు పత్రికాధినేత మీద.