తెలుగు రాష్ర్టాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అందర్నీ చుట్టేస్తోంది. కట్టడి చర్యలు తీసుకుంటున్నా! కరోనాకి అవేం కనిపించలేదు. మానవాళిపై వైరస్ దాడి యధేశ్చగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలో చాలా మంది పొలిటీషన్లను వైరస్ చుట్టేసింది. అలాగే ప్రభుత్వ అధికారులపైనా పంజా విసిరింది. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం ఎమ్మెల్యే తోపురెడ్డి ప్రకాష్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన్ని హోం అసోలేషన్ లో ఉన్నారు. ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. అలాగే ఆయన గన్ మెన్ లకు కూడా కరోనా సోకింది. వాళ్లంతా ఇప్పుడు కరోనా వైద్యం పొందుతున్నారు.
అయితే ఎమ్మెల్యే తో సన్నిహితంగా ఉన్న వారి వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. కొంత మంది వివరాలు సేకరించి ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసారు. ఫలితాల రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్ కోట వైకాపా ఎమ్మలె్యే శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇంకా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఫ్యామిలీ హోం క్వారంటైన్ లో ఉంది. మరోవైపు అంబటి రాంబాబు కుటుంబంలో వైరస్ సోకినట్లు ప్రచారం సాగుతోంది.
ఇంకా టీడీపీకి చెందిన నేతలు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. అటు తెలంగాణ రాష్ర్ట ప్రజా ప్రతినిధుల్ని కరోనా చుట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కొవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి సోకిన తిరిగి అంతా ఆరోగ్యంతో భయటపడుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ..బలమైన ఆహారం సహా…డాక్టర్లు సూచనలు పాటిస్తూ వైరస్ నుంచి బయటపడుతున్నారు. వయో భారం ఉన్నా శరీరం లో పాత రోగాలు లేకపోతే కరోనాని జయించడం పెద్ద విషయమేమి కాదని డాక్టర్లు చెబుతున్నారు.