Gallery

Home News Cm Kcr: మాట తూలుడు.. ఆనక పరిస్థితులకు తలొగ్గుడు..! సీఎం కేసీఆర్ తీరే వేరయా..!!

Cm Kcr: మాట తూలుడు.. ఆనక పరిస్థితులకు తలొగ్గుడు..! సీఎం కేసీఆర్ తీరే వేరయా..!!

Cm Kcr: గతేడాది దేశంలోకి కరోనా అప్పుడప్పుడే ప్రవేశిస్తున్న దశలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కరోనా గురించి మాట్లాడారు. ‘తెలంగాణలోకి కరోనాతో వచ్చిన ఒక వ్యక్తిని అవహేళన చేశారు. కరోనా 35 డిగ్రీల ఎండలో మాడిపోతుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి మాస్కులు లేకుండానే వెళ్తారన్నారు. పారాసిట్మల్ టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందన్నారు’. కానీ.. వాస్తవంలో పరిస్థితులు తెలిసొచ్చాయి. కేంద్రం కంటే ముందుగానే రాష్ట్రంలో ఆంక్షలు విధించారు. దీంతో ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి.

Kt 2 1 | Telugu Rajyam

సెకండ్ వేవ్ లోనూ కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. స్వయంగా కరోనా నుంచి కోలుకున్న వెంటనే జరిపిన సమీక్షలో ‘లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. ఆర్ధికవ్యవస్థ దెబ్బతింటుంది. రాష్ట్రాల్లో లాక్ డౌన్ వారి ఇష్టం. రాష్ట్రంలో పరిస్థితులు కంట్రోల్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదు’ అన్నారు. కానీ.. వారం తిరిగేలోపు అత్యవసర కేబినెట్ మీటింగ్ పెట్టి రాష్ట్రంలో పది రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ అవసరంలేదన్న సీఎస్ సోమేశ్ కుమార్.. ఆయనే లాక్ డౌన్ ఆదేశాల్ని అమలు చేయాల్సిన పరిస్థితి.

రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ పేపర్లో రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులపై ఒక ఫొటో వేశారు. తెలంగాణ మినహా ప్రతి రాష్ట్రం పూర్తిగా లేదా పాక్షిక లాక్ డౌన్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో పరిస్థితులు కంట్రోల్ లో ఉన్నాయని ఎలా చెప్పారో అర్ధంకానిది. పైగా.. హైకోర్టు ఒత్తిడి, హైకోర్టు ఆదేశాలకు తగ్గట్టు పరీక్షల సంఖ్య పెంచట్లేదని.. కేసులు తక్కువగా చూపుతున్నారనే ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న కేసులు.. ఇవన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని చెప్పాలి. దీంతో లాక్ డౌన్ అనివార్యమన్న ఊహాగానాల మధ్య ఈరోజు మధ్యాహ్నం లాక్ డౌన్ ప్రకటించారు.

చర్యలకు దిగితే కేసీఆర్ సమర్ధవంతంగా పని చేస్తారు. నిన్న ప్రధానితో కూడా శెభాష్ అనిపించుకున్నారు. కానీ.. సహజంగా ఆయనలో ఉన్న ధైర్యం ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తున్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ ప్రమాద సంకేతాల్ని ఇస్తోందనో, ప్రజా వ్యతిరేకత వస్తుందనో, హైకోర్టు చీవాట్లతో పరువు పోతుందనో ఇలా హడావిడి నిర్ణయాలు తీసుకునే కంటే సీఎంగా తన స్థాయిలో ముందే నిర్ణయం తీసుకునుంటే బాగుండేదని చెప్పాలి.

 

- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News