RRR Trailer : ‘RRR’ ట్రైలర్ చూసాక మెగాస్టార్ మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.!

RRR Trailer : విపరీతమైన అంచనాలు నడుమ ఈరోజు భారీ లెవెల్ ప్రమోషన్స్ తో రిలీజ్ కాబడిన మోస్ట్ అవైటెడ్ ట్రిపుల్ ఆర్(RRR) ట్రైలర్ ని విడుదల చెయ్యగా అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి కూడా ఒకటే యూనానిమస్ రెస్పాన్స్ ఈ ట్రైలర్ అందుకుంటుంది.

దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్టైగర్ ఎన్టీఆర్ ల బ్లాస్ట్ కి టోటల్ ఇండస్ట్రీ ఫిదా కాగా ఇప్పుడు ఈ మాసివ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి తన మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ను అందించారు.

‘RRR’ ట్రైలర్ భీభత్సంగా ఉందని అలాగే ఈ ప్రభంజనంకి వచ్చే జనవరి 7న చూసేందుకు చాలా ఎదురు చూస్తున్నాయని ఓ రేంజ్ లో తెలిపారు. ఈ లెక్కన ఈ సినిమా ట్రైలర్ చిరు కి ఏ రేంజ్ లో నచ్చిందో మనం అర్ధం చేసుకోవాలి.

ఇప్పుడు అయితే ఈ ట్రైలర్ అన్ని భాషల్లోని భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తూ దుమ్ము లేపుతుంది. ఇక ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని మరియు శ్రేయ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం వచ్చే జనవరి 7న విడుదల కానుంది.