China Spy: భారత్ లో చైనా గూఢచారి..! విచారణలో కలకలం రేపే అంశాలు..

China Spy: ఈనెల రెండో వారంలో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం మాల్దా వద్ద ‘హాన్ జున్వే’ అనే చైనా గూఢచారి అరెస్టయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా అతను వెల్లడిస్తున్న విషయాలు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా చూస్తే.. భారత రక్షణ వ్యవస్థలోని కీలకమైన వెబ్ సైట్లపై చైనా నిఘా పెట్టి హ్యాక్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. పదేళ్లుగా భారత్ లో జున్వే కార్యకలాపాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స వివరాలు సేకరిస్తోంది. చైనా ఏజెన్సీలు భారత రక్షణ వ్యవస్థ, భారత వైమానిక రంగంలోని వెబ్ సైట్లు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్లపై కన్నేశాయి. బెంగళూరు బీఎస్ఎన్ఎల్ తో కలిసి పని చేస్తున్న ఓ కంపెనీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

మొత్తంగా భారత రక్షణ వ్యవస్థ రహస్యాలను చేధించే క్రమంలో ఉంది. నిందితుడు ఎక్కడెక్కికి వెళ్లాడు. ఈ రహస్యాల చేధనలో అతడి పాత్ర ఎంత? మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్నాడా? 2010లో హైదరాబాద్ ఎందుకొచ్చాడు? అతడి పాస్ పోర్టుపై బంగ్లాదేశ్ స్టాంప్ తప్పితే మరొకటి లేదు. పాస్ పోర్ట్ లేకుండా భారత్ లోకి ఎలా వచ్చాడు? ఇక్కడి నుంచి ఎవరైనా గైడ్ చేశారా? మరో పాస్ పోర్ట్ ఉందా? బీఎస్ఎఫ్ దళాలు వెంటపడినప్పుడు విసిరేన పత్రాల్లో ఏముంది? మొత్తం ఎన్నిసార్లు భారత్ వచ్చాడు?.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంక్ పత్రాలు స్వాధీనం చేసుకునేందుకే మూడు రోజులు పట్టాయి.

హాన్ జున్వే ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అతని వద్ద లభించిన పరికరాలు గూఢచర్యానికి సంబంధించినవే. పాస్ పోర్టుపై బంగ్లాదేశ్, నేపాల్ వీసాలున్నాయి. చిన్న చిన్న సైబర్ నేరాలు చేస్తున్నాడు. ఫోన్, ల్యాప్ టాప్ లకు మాండరీన్ పాస్ వర్డ్ లు ఇచ్చారు. వీటిని ఓపెన్ చేసేందుకు కష్టంగా ఉండేలా చేశారు. ఎన్ఐఏ, ఎన్ఎస్జీలు మాత్రమే వీటిని ఓపెన్ చేసే సామర్ధ్యం ఉంది. యాపిల్ ల్యాప్ టాప్, రెండు ఐఫోన్లు, రెండు చైనా సిమ్ లు, ఒక భారత్ సిమ్, బంగ్లాదేశ్ సిమ్, రెండు పెన్ డ్రైవ్ లు, రెండు చిన్న టార్జి లైట్లు, క్యాష్ ట్రాన్సాక్షన్లు చేసే మెషీన్లు అయిదు.. స్వాధీనం చేసుకున్నారు.