విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంలచనమైందో తెలిసిందే. 15 మంది ప్రాణాలు కోల్పోగా, వదలాంది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలుతూనే ఉన్నాయి. దుర్ఘటన చోటు చేసుకున్న వెంటనే ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పింది. లేదంటే ఘటన ఊహించని విధంగా ఉండేది. ఇక ప్రభుత్వం తరుపున అందాల్సిన పరిహారం ఇప్పటకే అందింది. అయితే ఈ ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదిగానే స్పందించారు. నేరుగా బాధిత కుటుంబాల్సి కలిసి పరామర్శించిది లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై విమర్శలు వచ్చాయి.
ఇక టీడీపీ మూడు రోజుల పండుగ మహానాడు వేదికగా బాధిత కుటుంబాలకు 50 వేలు ఆర్ధిక సహాయం ప్రకటించి ఊరట కల్పించారు. గత నెల 27 28,29 తేదీల్లో విజయవాడలో కొద్ది మంది పార్టీ సీనియర్ నేతలతో ఆన్ లౌన్ లో ఈ వేడుకను ముంగించారు. అనంతరం విశాఖ చేరుకుని గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తారని అంతా భావించారు. కానీ చంద్రబాబు అండ్ కో అంత రిస్క్ తీసుకోలేదు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి స్మార్ట్ గా హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు విజయవాడ వరకూ రావడానికి గ్యాస్ బాధితుల పేర్లు చెప్పి అనుమతి తీసుకుని మహానాడు ముగించారని ఆరోపణలున్నాయి.
మహానాడు కార్యక్రమం అంటే వైకాపా అనుమతివ్వదని…విశాఖ బాధితుల్ని అలా వాడుకున్నారని వినిపించింది. అయితే తాజాగా గ్యాస్ బాధితులకు చంద్రబాబు ఓ లేఖ రాసారు. అందులో వైకాపా ప్రభుత్వం మీమ్మల్ని పరామర్శించడానికి అనుమతివ్వ లేదు. అందుకే రాలేకపోయాను. మా పార్టీ నేతలు మీ ఇళ్లకు వచ్చి నేను రాసిన లేఖని మీకు అందిస్తారని..దాన్నే నా రాకగా భావించాలని అన్నట్లు చెప్పకనే చెప్పినట్లు ఉంది. చంద్రబాబు తప్పించుకోవడానికి ఇలా లేఖాస్ర్తం విసురుతున్నారని వైకాపా నేతలు మండిపడుతున్నారు. ఆయనకు చిత్త శుద్ది ఉంటే నేరుగా బాధిత కుటుంబాల్ని కలిసేవారని ఆరోపించారు. అప్పుడంటే ఆంక్షలున్నాయి…ఇప్పుడు పెద్దగా ఆంక్షలు లేనప్పుడు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నిస్తున్నారు.