Raghu Rama Raju: రఘు రామరాజు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతుంది. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుంది.

గడిచిన ఐదేళ్లలో జగన్ రెడ్డి పాలనలో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కున్నారు ముఖ్యంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి, గందరగోళం వంటివి ఎదుర్కొంది. గత 5 సంవత్సరాలలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ఘనత జగన్ రెడ్డిది.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోని కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించింది అంతే కాకుండా ట్రూ డౌన్ అమలు వలన యూనిట్ కి 13 పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు.

