చంద్రబాబు, పవన్ జగన్ ను ఫాలో అవుతారా.. లేక ఆ తప్పే చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఏమిటనే ప్రశ్నకు నవరత్నాలు కారణమని చాలామంది చెబుతారు. నవరత్నాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు దక్కాయి. 2019 ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ నవరత్నాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్, చంద్రబాబు మాత్రం జగన్ ను ఫాలో కావడం లేదు.

2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామనే విషయాలను అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కానీ ప్రకటించడం లేదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు మ్యానిఫెస్టోలను ప్రకటించినా ప్రజలకు మ్యానిఫెస్టోపై పూర్తిస్థాయిలో అవగాహన రాదు. మరోవైపు సీఎం జగన్ కొత్త హామీలను ప్రకటించే అవకాశం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇచ్చిన హామీల వల్ల ప్రభుత్వంపై ఊహించని స్థాయిలో ఆర్థిక భారం పెరిగింది.

చంద్రబాబు, పవన్ ఎలాంటి హామీలను ప్రకటిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు టీడీపీ ఇటు జనసేన నేతలు జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై చాలా సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలను వ్యక్తం చేశారు. మరి ఉచిత పథకాలను అమలు చేయడానికి టీడీపీ, జనసేన సిద్ధమవుతాయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే 2019 ఫలితాలే 2024లో రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా టీడీపీ, జనసేన ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పార్ట్ టైమ్ రాజకీయాలు జనసేన పార్టీకి మైనస్ అవుతున్నాయే తప్ప ప్లస్ కావడం లేదు. పవన్, చంద్రబాబు మారాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా చేదు ఫలితాలు ఎదురైతే ఈ రెండు పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.