బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఇంతవరకూ చప్పగానే సాగిందనుకోవాలి. ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే, నటరాజ్‌ని బయటికి పంపించేశారు. హౌస్‌లో పులి అంటూ పెద్దరికం చాటుకుంటోన్న నటరాజ్ ఎలిమినేషన్ వెనక బిగ్ స్కెచ్ ఉందని అంటున్నారు. వాస్తవానికి ప్రియ ఎలిమినేట్ కావాల్సి ఉంది.
గత మూడు వారాల నుంచీ కూడా ప్రియను అలా కాపాడుకుంటూ వస్తోన్న బిగ్ బాస్ వ్యూహంలోని అంతరార్ధమేమిటో కానీ, హౌస్‌కి వీళ్లు అవసరం అనుకున్నవాళ్లంతా వరుసగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అనవసరం అనుకున్నవాళ్లని హౌస్‌లో ఎందుకు ఉంచుతున్నారో ఆడియన్స్‌కి అర్ధం కావడం లేదు.
ఇకపోతే, నటరాజ్ హౌస్‌లో ఉన్నన్నాళ్లూ ఏదో ఒక కాంట్రవర్సీ ఉండేది. అతి ఆవేశం, అంతా నేనే అనే ఆటిట్యూడ్ హౌస్‌లో చాలా మందిని ఇబ్బంది పెట్టింది. హౌస్‌లో చాలా చాలా అంతర్మధనం ఫీలయ్యాను.. అంటూ హౌస్ నుంచి బయటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ చెప్పాడు. కానీ, హౌస్ మేట్స్‌పై ఎలాంటి ధూషణలూ చేయలేదు.
బయటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ హౌస్ మేట్స్ ఒక్కొక్కరితోనూ ఆడేసుకుంటాడనుకున్నారు. కానీ, అలా జరగలేదు. చాలా కామ్‌గా, ‘నా భార్యకు నా అవసరం ఉందనుకుంటా.. అందుకే ఆ భగవంతుడే నన్ను బయటికి పంపిస్తున్నాడేమో..’ అంటూనే, విజయం సాధించి తిరిగి రమ్మని చెప్పిన నా భార్య మాట నిలబెట్టుకోలేకపోతున్నాను.. అంటూ అసహనం వ్యక్తం చేశారు.